![]() |
![]() |
.webp)
స్టార్ మాలో ఎన్నెన్నో జన్మల బంధం అనే సీరియల్ ఎంతగా పాపులర్ అయ్యిందో అందరికీ తెలుసు. అందులో వేద రోల్ బాగా హైలైట్ అయ్యింది. ఈ సీరియల్ ద్వారా ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అదే రేంజ్ లో పెరిగింది. ఇప్పుడు కొంచెం గ్యాప్ తర్వాత వేద కొత్త ప్రాజెక్ట్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి సత్యగా అందరి ముందుకు రాబోతోంది. ఇక ఆ కొత్త సీరియల్ పేరే "సత్యభామ" లేడీ ఓరియెంటెడ్ రోల్ లో మంచి డైనమిక్, పవర్ఫుల్ గా వేద కనిపించబోతోంది.
ఇప్పుడు ఈ సీరియల్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో కాలేజీ బ్యాక్ డ్రాప్ లో సత్యభామ అండ్ టీమ్ బుక్స్ పట్టుకుని వెళ్తుంటే ఒక కుర్రాడు రాగింగ్ పేరుతో ఒక అమ్మాయి చున్నీ లాగడం సత్య వెళ్లి అతన్ని ఒక్కటి పీకడం చూపించారు. "ఆడది కొట్టే దెబ్బలు తట్టుకోవడం చున్నీ లాగినంత ఈజీ కాదు..ఏడుస్తూ కూర్చుంటే ఏడుపే మిగులుతుంది ఎవరో వచ్చి మనల్ని సేవ్ చేయరు..మనకు మనమే సేవ్ చేసుకోవాలి" అని చెప్పే పవర్ఫుల్ లేడీగా సత్య కనిపించబోతోంది.
"ప్రేమను తప్ప హింసను భరించలేని ఈ సత్య జీవితం ఎలా ఉండబోతోంది" అనే థీమ్ తో త్వరలో రాబోతోంది. ఈ సీరియల్‌లో హీరోగా ఎన్నెన్నో జన్మల బంధం హీరో యష్ అలియాస్ నిరంజన్ ను తీసుకోవాలంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్‌లో యష్ వేద జోడికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఐతే మరి ఈ సత్యభామకు ఏ కృష్ణుడు జోడీగా రాబోతున్నాడా తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
![]() |
![]() |